మౌన రాగం 6
telugu stories మౌన రాగం 6 ఆయేషా ఆఫీస్ కి బయలుదేరుతూ తన బ్యాగ్ కోసం ఇల్లంతా వెతికింది...ఎక్కడా బ్యాగ్ కనపడకపోయేసరికి... ఎక్కడ పెట్టానబ్బా అని ఆలోచిస్తూ ఉండగా.... రాత్రి తెచ్చి రూమ్ లో టేబుల్ మీద పడేసిన అథర్వ్ కోట్ కనిపించింది... దాన్ని చూడగానే... ఒక్కసారిగా నోరు తెరిచి... హాయ్ అల్లా... ఈ రాక్షసుడి కోటు ఉతికి ఐరన్ చేయలేదుగా అనుకుంది... ఇప్పుడు టైం లేదు... రేపు ఉతికి ఐరన్ చేస్తాను...చెప్తే వినడు.... ఈ.. అంటూ తినేసేలా చూస్తాడు... ఏం చేస్తాం భరించాలి.. తప్పదు అనుకుంటూ... ఫోన్... ఒకసారి ఫోన్ చేస్తే బ్యాగ్ ఎక్కడ ఉందో తెలుస్తుందిగా అనుకుని... బాబీ.. మీ మొబైల్ ఇవ్వండి ఒకసారి అని షబానా ఫోన్ తీసుకుని తన ఫోన్ కి ఫోన్ చేసింది... ఫోన్ రింగ్ అవుతుంది కానీ... ఇంట్లో ఎక్కడా సౌండ్ వినిపించడం లేదు... రెండు, మూడు సార్లు వెంట వెంటనే చేసే సరికి... అథర్వ్ ఫోన్ లిఫ్ట్ చేసాడు... ఫోన్ లిఫ్ట్ చేయడం చూడగానే... ఆయేషా ఆశ్చర్యం గా హెలో అని అంది... హా... అన్నాడు అథర్వ్... అంతే... ఆ గొంతు అథర్వ్ ది అని ఆయేషా కి అర్ధమై ఒక్కసారిగా ఫోన్ కట్ చేసేసింది... బాబోయ్ బ్యాగ్ రాత్రి కార్ లోనే మర్చి పోయాను అనుకుంటా... తెచ్చి ఇస్తాడో.. లేక ఎక్కడన్నా విసిరి కొడతాడో... దాన్లోనే బ్యాంక్ కార్డ్స్... ఐ డి కార్డ్స్... బస్ పాస్..మొబైల్ అన్నీ ఉన్నాయి....నాకు నిజంగానే మైండ్ పని చేయడం లేదు అని తల కొట్టుకుంది ఆయేషా... వేరే బ్యాగ్ తీసుకుని ఆఫీస్ కి బయలుదేరింది... ఫాతిమా గట్టిగా