Posts

Showing posts from November, 2024

అంతా మిథ్యే

 కొంతకాలం క్రితం మన దేశంలో ఒక గురువు ఉండేవాడు. ఆయన అద్వైత మతాన్ని ప్రచారం చేస్తూ దేశమంతా తిరుగుతుండేవాడు. ఈ ప్రపంచం ఒక మాయ , సర్వం మిథ్య అని చెప్పేవాడు.  ఆ గురువు ఒకసారి ఒక అడవి మార్గం గుండా ప్రయాణిస్తున్నాడు.  దూరంగా ఒక ఏనుగు వేగంగా వస్తూ కనిపించింది.  గురువు పరిగెత్తి పారిపోయాడు. శిష్యుడు కూడా ఆయన వెంట పరుగు తీశాడు.  కొంతసేపటి తర్వాత ఒకచోట ఆగాడు గురువు.  అప్పుడు శిష్యుడు ఇలా అడిగాడు. 'గురువు గారు! అంతా మిథ్యే అని చెబుతున్నారు కదా! ఏనుగు కూడా మిథ్యే కదా.. మరి ఎందుకు పారిపోయారు.?' అప్పుడు ఆ గురువు గారు ఇలా చెప్పారు.  'ఏనుగూ మిథ్యే. పారిపోవడం కూడా మిథ్యే నాయనా !'  -సాయికిరణ్ పామంజి