అరేబియా రాత్రులు
పర్షియా దేశంలో ఒక సుల్తాన్ ఉండేవాడు. అతను ఎన్నోచోట్ల వెతికి ఒక గుణవంతురాలైన అందమైన స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. అతను ఒక్క క్షణం కూడా భార్యను విడవకుండా కాలం గడిపాడు. కొంతకాలం తర్వాత పరిపాలన గాలికి ఒదిలేయడం మంచిది కాదు అని గుర్తు చేశాడు వజీరు. అప్పటినుంచి సుల్తాను రాణితో గడిపే సమయం తగ్గించి పాలన చూసుకోవడం ప్రారంభించాడు. శరీర సుఖానికి రుచి మరిగిన రాణి కొంతకాలం ఆగింది. ఆ తర్వాత ఆగలేకపోయింది. కోటలో ఎంతోమంది నీగ్రో బానిసలు సేవకులుగా ఉన్నారు. వారిలో ఒకడ్ని చూసుకొని రంకు ప్రారంభించింది. ఈ వ్యవహారం కొంతకాలం గుట్టుగా సాగింది. ఒక దురదృష్టకరమైన రోజున .. రాణి తన ప్రియుడితో కులుకుతుండగా రాజు చూడనే చూశాడు. అతని హృదయం బద్దలైపోయింది. రాణిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు అతను. ఆమె కలలో కూడా తనను మోసం చేయదని నమ్మాడు అతను. బాధ కోపంగా మారింది సుల్తాన్‌కు. రాణి, ఆమె నీగ్రో ప్రియుడు రాజు కోపానికి బలైపోయారు. రాణి చేసిన నమ్మకద్రోహంతో సుల్తాన్ రాక్షసుడిగా మారిపోయాడు. లోకంలోని స్త్రీలందరూ ఇంతే .. భర్తను నమ్...